News October 8, 2024

కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు రూ.585 కోట్లు

image

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈసీకి వివరాలను సమర్పించింది. యాడ్స్, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, ఇతరత్రాలకు మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్ వద్ద డిపాజిట్ల రూపంలో రూ.170 కోట్లు ఉండగా వివిధ మార్గాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయని పేర్కొంది.

Similar News

News September 19, 2025

ఆ ఒక్క టెస్టుతో రెండు జబ్బులూ గుర్తించొచ్చు..

image

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే మామోగ్రామ్ టెస్టు ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ముప్పును గుర్తించే ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయోగించి దీనికి శిక్షణ ఇచ్చారని ‘హార్ట్‌’ వైద్య పత్రికలో ప్రచురించారు. ఈ టూల్‌‌తో రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదాన్ని గుర్తించొచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ జెన్నిఫర్‌ తెలిపారు.

News September 19, 2025

రోజూ వాల్‌నట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలా?

image

* మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి
* బరువును నియంత్రిస్తాయి
* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి
* సంతాన సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి
* ఎముకలను బలోపేతం చేస్తాయి
* క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
* షుగర్ రాకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు.
Share It

News September 19, 2025

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే లేరు: కేటీఆర్

image

TG: వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గానీ, ముస్లిం ఎమ్మెల్సీ గానీ లేరని వ్యాఖ్యానించారు.