News October 8, 2024

మంత్రిపై పరువు నష్టం కేసు.. విచారణకు నాగార్జున

image

TG: కాంగ్రెస్ మంత్రి సురేఖపై పరువు నష్టం కేసులో నేడు హీరో నాగార్జున విచారణకు హాజరు కానున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.

Similar News

News March 14, 2026

ఇరాన్‌పై దాడులు.. 2 వారాల్లో 2,000 మంది మృతి!

image

ఇరాన్‌పై US&ఇజ్రాయెల్ గత 2 వారాలుగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 2వేల మందికి పైగా చనిపోయారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య 11కి చేరింది. ఈ లిస్టులో వెస్టర్న్ ఇరాక్‌లో క్రాష్ అయిన రీఫ్యుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బంది ఆరుగురు కూడా ఉన్నారు. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 100+ మంది పిల్లలు మరణించినట్లు లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.

News March 14, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 14)

image

1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం (ఫొటోలో)
1883: తత్వవేత్త, రాజకీయ ఆర్థికవేత్త కారల్ మార్క్స్ మరణం
1917: సినీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ జననం
1931: భారత్‌లో తొలి టాకీ మూవీ ‘ఆలం ఆరా’ విడుదల
1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
2008: శంషాబాద్ విమానాశ్రయ ప్రారంభోత్సవం
2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
* అంతర్జాతీయ గణిత దినోత్సవం

News March 14, 2026

IPLకు హర్షిత్ రానా దూరం?

image

ఈ నెల 28 నుంచి జరగనున్న IPL-2026కి టీమ్‌ఇండియా బౌలర్, KKR పేసర్ హర్షిత్ రానా దూరమైనట్లు నేషనల్ మీడియా పేర్కొంది. టీ20 WCకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో గాయపడిన ఆయన ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. గత రెండు సీజన్లలో KKR తరఫున రానా 34 వికెట్లు తీశారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా ఆకాశ్ మద్వల్, సిమర్జీత్ సింగ్‌తో పాటు మరికొంతమంది డొమెస్టిక్ బౌలర్ల పేర్లను KKR పరిశీలిస్తున్నట్లు సమాచారం.