News October 8, 2024

లింగాలగూడెంలో క్షుద్ర పూజలు.. భయాందోళనలో గ్రామస్థులు

image

మండలంలోని లింగాలగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన బొబ్బలి నరసింహ, గన్నేబోయిన వెంకన్న ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన మూటలను ఇళ్లలో పడేసి వెళ్లారు. వాటిని గమనించిన సదరు వ్యక్తులు మూటలు విప్పి చూడగా అందులో పసుపు,కుంకుమ, నిమ్మకాయలు, నవధాన్యాలు, గవ్వలు, జీడిగింజలు, తాటి ఆకు బొమ్మలు బయటపడ్డాయి.

Similar News

News November 10, 2025

NLG: ఆయకట్టులో జోరుగా వరి కోతలు

image

నాగార్జునసాగర్ నాన్ ఆయకట్టు, ఆయకట్టు పరిధిలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1.26 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రైతులకు పంటచేతికి వచ్చే సమయంలో ఒక పక్క అకాల వర్షం వెంటాడుతుండగా.. మరో పక్క కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవూర, హాలియా, నిడమనూరు మండలాల్లో కూలీల కొరత మరింత ఎక్కువగా ఉంది.

News November 9, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ నల్గొండ : హైవే విస్తరణ… అభివృద్ధికి కొత్త మార్గం
→ నల్గొండ : కూరగాయలు కొనేటట్లు లేదు..!
→ నల్గొండ : ఇక్కడి నాయకులంతా అక్కడే…!
→ చిట్యాల : గాంధీ గుడిలో అక్షయపాత్ర గురించి తెలుసా?
→ నల్గొండ : బోగస్ ఓట్లకు చెక్
→ నేరేడుచర్ల : గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం
→ నార్కట్ పల్లి : చెర్వుగట్టుకి పోటెత్తిన భక్తులు

News November 9, 2025

NLG: చేతిలో పైసల్లేవ్.. కష్టంగా కుటుంబ పోషణ!

image

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న తమకు వేతనాలు సకాలంలో అందడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. ఏజెన్సీల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నామన్నారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ఆస్పత్రి అధికారులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. చేతిలో పైసల్లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు.