News October 8, 2024
ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో రాయితీపై టమాటా, ఉల్లి

AP: సెంచరీ దాటిన టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50, ఉల్లి రూ.40-45 చొప్పున విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుతో వెళితే కుటుంబానికి కిలో చొప్పున ఇస్తామన్నారు.
Similar News
News March 11, 2026
60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.
News March 11, 2026
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 11, 2026
యుద్ధం తిప్పలు.. ‘షార్ట్స్ వేసుకోండి, మెట్లు ఎక్కండి’

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో విద్యుత్ ఆదా చేసేందుకు థాయిలాండ్ ప్రధాని అక్కడి ఉద్యోగులకు స్పెషల్ రూల్స్ ప్రవేశపెట్టారు. ఆఫీసుల్లో ఏసీలు 26-27 డిగ్రీల వద్దే మెయింటెన్ చేయాలని ఆదేశించారు. సూట్లు, టైలకు బదులు షార్ట్స్, షర్ట్స్ వేసుకోవాలని సూచించారు. ఎలివేటర్లకు బదులు మెట్లు ఉపయోగించాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. కాగా థాయిలాండ్‌లో 68% విద్యుత్ నేచురల్ గ్యాస్ నుంచే ఉత్పత్తి అవుతోంది.


