News October 8, 2024
HNK: ‘పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది’

తల్లిదండ్రులు లేకపోయినా నిరుత్సాహ పడలేదు. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి శ్రీజకు తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసి మల్టీ జోనల్ 22వ ర్యాంక్ సాధించింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈవోగా నియామక పత్రం అందుకుంది.
Similar News
News April 1, 2026
వరంగల్: రేపు ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని 317 గ్రామాలు, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ముఖ్యమంత్రి సందేశంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల వెల్లడి, అమలు చేయనున్న పథకాలను ప్రజలకు వివరిస్తారు.
News April 1, 2026
CMR బకాయిలపై కఠిన చర్యలు.. మిల్లర్లకు నోటీసులు

హనుమకొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. 2014 నుంచి ఇప్పటివరకు 12 మంది రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా ఉండగా, వీరివద్ద సుమారు రూ.80.96 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు, రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం ద్వారా బకాయిల వసూళ్లకు చర్యలు ప్రారంభించారు.
News April 1, 2026
WGL: ఫీజు రీయింబర్స్మెంట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

2025– 26 విద్యాసంవత్సరానికి వరంగల్ జిల్లాలోని కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగుల ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు పోస్టుమెట్రిక్, ప్రీమేట్రిక్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి పీ.భాగ్యలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు ఈనెల 20లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.


