News October 8, 2024
ఈరోజు దుర్గమ్మను దర్శిస్తే ఐశ్వర్యమే!

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు విజయవాడ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. మంగళప్రదమైన దుర్గమ్మను దర్శించుకున్న వారికి ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని ప్రతీతి. మూడు శక్తుల్లో ఒకరైన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిన విషయం తెలిసిందే.
Similar News
News March 13, 2026
‘క్రీమీ లేయర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ హోదాను తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా సంస్థల్లో వారి పదవులు, హోదానూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సివిల్స్ పరీక్షను క్లియర్ చేసినా క్రీమీ లేయర్‌లో పొరపాటున చేర్చడంతో నష్టపోయిన అభ్యర్థులకు ఊరట కల్పించింది. వారి అపాయింట్‌మెంట్స్‌ను నిరాకరిస్తూ కేంద్రం వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.
News March 13, 2026
క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అంటే?

OBC కేటగిరీని క్రీమీ/నాన్ క్రీమీ లేయర్ అని 2 రకాలుగా విభజిస్తారు. ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెంది, వార్షికాదాయం ₹8Lకు పైగా(జీతం, వ్యవసాయ ఆదాయం మినహాయించి) ఉంటే క్రీమీ లేయర్‌గా పరిగణిస్తారు. వారికి రిజర్వేషన్లు వర్తించవు. ఆదాయ పరిమితి ఏడాదికి ₹8L కంటే తక్కువగా ఉన్న వారిని నాన్ క్రీమీలేయర్‌గా పరిగణించి ఉన్నత విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పిస్తారు.
News March 13, 2026
క్యాబినెట్ భేటీ.. ప్రతిపాదనలు ఇవే..

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే రూ.119 కోట్ల ఖర్చుతో తెలుగు కల్చరల్ సెంటర్, సచివాలయం, HoD టవర్ల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్ ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. వ్యవసాయం, పరిశ్రమలు, జలవనరులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది.


