News October 8, 2024
నల్లగొండలో రేపు జాబ్ మేళా

నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
NLG: 62 పోస్టులు.. 16న ఇంటర్వ్యూలు

ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది కోసం ఈనెల 16న ప్రిన్సిపల్ ఛాంబర్‌లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. మెడికల్ కళాశాలలో ఒక ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్స్, 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 14 మంది ట్యూటర్స్‌ను తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకోనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.
News March 13, 2026
NLG: ఒక్కో పంటపై రూ.2వేల పెంపు..!

రాబోయే సాగు సీజన్‌కు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల రుణ పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఒక్కో పంటపై అదనంగా రూ.2,000లు పెంచుతూ బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నల్లగొండ జిల్లాలోని సుమారు 5,65,803 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
News March 13, 2026
NLG: గ్యాస్ ‘గందరగోళం’.. సర్వర్లు డౌన్

జిల్లాలో సామాన్యుడి వంట గదిలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు ఒక్కసారిగా రీఫిల్లింగ్ కోసం ఎగబడుతుండటంతో బుకింగ్ నెట్‌వర్క్ పూర్తిగా కుప్పకూలింది. వినియోగదారులు గ్యాస్ రీఫిల్ కోసం ఆశ్రయించే డిజిటల్ మార్గాలు ప్రస్తుతం చేతులెత్తేశాయి. వేల సంఖ్యలో వినియోగదారులు ఏకకాలంలో ప్రయత్నిస్తుండటంతో మిస్డ్ కాల్, IVRS వ్యవస్థలు పనిచేయడం లేదని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.


