News October 8, 2024
దసరా: హైదరాబాద్‌ను విడిచి ఊరెళ్లిపోతున్నారు!

దసరా పండుగతో నగరం ఖాళీ అవుతోంది. HYD ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పట్టణం నుంచి పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో MGBS, JBS, ఉప్పల్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Similar News
News March 3, 2026
హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంటోంది!

హోలీ పండుగ, గ్రహణం ఉండటంతో నగరంలో రోడ్లు, బస్సులు వెలవెలబోయాయి. సాధారణంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఖాళీగా కనిపించాయి. ప్రజలు ఇళ్ల వద్దే కుటుంబాలతో పండుగ జరుపుకోవడంతో బయట రాకపోకలు తగ్గాయి. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు బస్సుల్లో ప్రయాణికులు లేక సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రంగుల సందడి కాలనీలకే పరిమితమైంది. బండ్ల పొగ లేక నగరం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది.
News March 3, 2026
‘బ్లాక్‌చైన్ బస్తీ’గా పాతబస్తీ?

చార్మినార్ పరిసరాల్లోని యువత ఇప్పుడు బిర్యానీ కబుర్ల కంటే ‘బ్లాక్‌చైన్’ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న ఇంటర్నెట్ సెంటర్లలో డిజిటల్ లెడ్జర్స్, క్రిప్టో కోడింగ్‌పై వర్క్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. విదేశీ ప్రాజెక్టుల కోసం ఇక్కడి కుర్రాళ్లు ఫ్రీలాన్సింగ్ చేస్తూ భారీగా సంపాదిస్తూ పాతబస్తీ యువత డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇది భవిష్యత్తులో HYDకు కొత్త గుర్తింపు తీసుకురావడం ఖాయం.
News March 3, 2026
GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.


