News October 8, 2024

అలిపిరి మెట్ల మార్గంలో గుండెపోటుతో భక్తుడు మృతి

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఓ భక్తుడు మృతి చెందిన ఘటన సోమవారం తిరుమలలో జరిగింది. నాగలాపురం మండలం రెడ్డి వీధికి చెందిన సుబ్రహ్మణ్యం (65), తన భార్య లత మరో 15 మంది భక్తులతో కలిసి శనివారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. సోమవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గంలో కొండను ఎక్కుతుండగా 2400 మెట్టు వద్ద ఫిట్స్ వచ్చి కిందపడి పోయాడు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News January 10, 2026

చిత్తూరు: ఘనంగా ప్రారంభమైన తైక్వాండో పోటీలు

image

ఐదో అంతర్ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్-2026 పోటీలు చిత్తూరు మెసానికల్ గ్రౌండ్లో ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. గ్రాండ్ మాస్టర్ బాబురావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజులపాటు జరగనున్న పోటీలలో ఏపీ, తెలంగాణతో పాటు పది రాష్ట్రాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.

News January 10, 2026

చిత్తూరులో రేపు వడ్డే ఓబన్న జయంతి

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు జయంతి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానునట్లు పేర్కొన్నారు.

News January 10, 2026

సూళ్లూరుపేట: పక్షుల పండుగ.. నేటి కార్యక్రమాలు

image

ఉ. 9 గంటలు: S.పేట హోలీక్రాస్ సర్కిల్ నుంచి కళాశాల మైదానం వరకు శోభాయాత్ర
9.30- 12 : పక్షుల పండుగ, స్టాళ్ల ప్రారంభం
సా.5 : సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లెమింగో‌పై పాటకు డాన్స్, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షితకేంద్రం, పులికాట్ సరస్సులో వేట విన్యాసాలపై వీడియో ప్రదర్శన, లైటింగ్ ల్యాంప్
సా.6.30కి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఆవిష్కరణ
సా.7గంటలకు అతిథుల ప్రసంగాలు
సా.7.30-10 గంటల వరకు పాటకచ్చేరి, డాన్స్