News October 8, 2024
HYD: LRS కోసం దరఖాస్తు చేసుకోండి

HYD, RR, MDCL జిల్లాలో అనుమతి లేని ఇంటి స్థలాలతో పాటు, అనధికార లేఅవుట్లలోని ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు 2020 నవంబరులో అప్పటి ప్రభుత్వం LRS పేరిట దరఖాస్తులు స్వీకరించింది. మధ్యలో దరఖాస్తు ప్రక్రియ ఆగిపోయినప్పటికీ మళ్లీ ప్రస్తుతం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. https://lrs.telangana.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని X వేదికగా టౌన్ ప్లానింగ్ అధికారులు సూచించారు.
Similar News
News April 18, 2026
KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

News April 17, 2026
రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.