News October 8, 2024

విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం

image

విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆగి ఉన్న ట్రక్కును వీరి బస్సు ఢీకొనగా.. ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 11మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఘటన జరగ్గా.. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయవాడ నుంచి 80మంది స్టడీ టూర్ కోసం వెళ్లినట్లు సమాచారం.

Similar News

News January 2, 2026

కృష్ణా: రైతులకు రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు

image

కృష్ణా జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 176 గ్రామాల రైతులకు రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని 21 మండలాల్లోని లబ్ధిదారులకు ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలలో వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే E-KYC ప్రక్రియ ముగియగా, బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన వారికి నేరుగా పట్టాలు అందనున్నాయి.

News January 2, 2026

కృష్ణా: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రామసభలలో రీ-సర్వే పూర్తయిన అనంతరం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను రైతులకు అధికారులు అందజేయనున్నారు. భూముల వివరాలపై సందేహాలు ఉంటే అక్కడికక్కడే నివృత్తి చేసే అవకాశం కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 82,210 పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

News January 1, 2026

కృష్ణా: కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం

image

నూతన సంవత్సర వేడుకలు జిల్లాలో అంబరాన్ని అంటాయి. గత సంవత్సరం స్మృతులను గుర్తు చేసుకుని కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరం 2026కు యువత స్వాగతం పలికారు. ఉదయమే ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకున్నారు. కొంతమంది మంచి సంకల్పంతో నూతన సంవత్సరం తొలి రోజును ప్రారంభించారు.