News October 8, 2024

నందిగం సురేశ్‌పై హత్య కేసు.. నేపథ్యమిదే.!

image

మాజీ MP నందిగం సురేశ్‌పై నమోదైన హత్య కేసులో సోమవారం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. 2020లో వెలగపూడిలో 2వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో వృద్ధురాలు మృతిచెందింది. ఆ సమయంలో వృద్ధురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించి.. ఘర్షణను నందిగం సురేశ్ ప్రోత్సహించారని, కేసు నమోదు చేయాలని ధర్నాకు దిగారు. అప్పుడు కేసు నమోదు కాగా, ఇటీవల మృతురాలి బంధువులు మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో విచారణ వేగవంతమైంది.

Similar News

News March 16, 2026

GNT: గ్యాస్ సరఫరాపై అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

image

ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, పారదర్శక సేవలు అందించాలన్నారు.

News March 16, 2026

అమరజీవి త్యాగం.. తెలుగు జాతికి పునాది: మంత్రి సవిత

image

అమరావతిలో 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా  58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు అభినందనీయమని మంత్రి సవిత కొనియాడారు. అమరావతిలోని సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావించిందన్నారు. నేటి తెలుగు ప్రజల ఉనికి పొట్టి శ్రీరాముల పోరాటంతోనే సాధ్యమైందన్నారు.

News March 16, 2026

GNT: రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి

image

విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన ప్రదీప్ రాజ్ (41) ఏలూరులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి ఏలూరు వెళ్తుండగా పిల్లలకు టిఫిన్ తినిపించేందుకు కారు ఆపారు. తిరిగి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్ల ముందే తండ్రి మరణించడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.