News October 8, 2024

MBNR: గణనీయంగా పెరిగిన BSNL.. త్వరలో 4G టవర్స్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. గత 3 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.

Similar News

News March 26, 2026

MBNR: హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలుశిక్ష

image

భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2023 జనవరి 31న చన్నారెడ్డిపల్లి గ్రామ పరిధిలో బాధితుడు యెరుకలి చెన్నయ్యపై నిందితులు యెరుకలి వెంకటయ్య A1, శ్రీను A2, మల్లేష్ A3 కలిసి ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన నవాబ్‌పేట్ పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు.

News March 26, 2026

MBNR: పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారంపై దృష్టి: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం జిల్లాలోని అన్ని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూ (NBW), ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 26, 2026

సబ్సిటీ రుణాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

ఎస్సీ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రూ.లక్ష లోపు రుణాలపై 90% సబ్సిడీ, రూ.3లక్షల లోపు రుణాలకు 70 శాతం సబ్సిడీ, రూ.3లక్షల నుంచి రూ.7లక్షల లోపు రుణాలకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు ఆమె వెల్లడించారు.