News October 8, 2024

వాకాటి నారాయణరెడ్డికి బెదిరింపు కాల్స్.. రూ.15 కోట్ల డిమాండ్

image

మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత వాకాటి నారాయణరెడ్డికి సోమవారం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ వాకాటి నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. రూ.15 కోట్లు ఇవ్వాలని లేకుంటే వివిధ కేసుల్లో అరెస్ట్ చేస్తామని వాకాటి నారాయణరెడ్డిని బెదిరించారు. దీంతో ఆయన నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Similar News

News April 9, 2026

తిరుపతి కాదు.. నెల్లూరులోనే ఉంచాలని లేఖ

image

నెల్లూరు ఇన్‌ఛార్జ్ డీపీవో వసుమతికి సీఈవోగా ప్రమోషన్ వచ్చింది. తిరుపతి జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఆమెను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇన్‌ఛార్జ్ డీపీవోగా ఆమె రికార్డు స్థాయిలో కేవలం 3నెలల్లో రూ.36 కోట్ల పన్నులు రాబట్టారు. వింజమూరు సభలో సైతం సీఎం చంద్రబాబు ఆమెను అభినందించిన విషయం తెలిసిందే.

News April 9, 2026

నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్

image

నెల్లూరు ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. త్వరలోనే పల్లెవెలుగు/అల్ట్రా పల్లెవెలుగు సిటీ సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది. RTC- అయ్యప్ప గుడి, RTC-కొత్తూరు, RTC-ఇనమడుగు క్రాస్ రోడ్డు, RTC-ములుమూడి బస్టాండ్, నవాబుపేట-ఆత్మకూరు బస్టాండ్, నారాయణ హాస్పిటల్-VRC సెంటర్ మార్గాల్లో బస్సులను నడపనుంది. టికెట్ రూ.10, రూ.20గా నిర్ణయించారు.

News April 9, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.