News October 8, 2024

మరికల్: రూ.11,11,111 నోట్లతో దుర్గామాత అలంకరణ

image

మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం 6వ రోజు అమ్మవారిని రూ. 11,11,111 కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామస్థులు దుర్గామాతను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Similar News

News May 8, 2025

మహబూబ్‌నగర్ రూరల్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

image

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.