News October 8, 2024
వరంగల్ మార్కెట్‌కు వరుస సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News March 9, 2026
పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
News March 9, 2026
వరంగల్: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లోని వేర్‌హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.