News October 8, 2024
కొత్త టీచర్లకు పోస్టింగ్ ఎప్పుడంటే?

TG: డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేయనున్నారు. నియామక పత్రాలు అందజేసిన తర్వాత అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికైన వారికి ఏ పాఠశాలలో పనిచేయాలో డీఈవోలు ఉత్తర్వులు ఇస్తారు. ఈ నెల 14తో దసరా సెలవులు ముగియనుండగా ఆలోపే వారికి పోస్టింగులు ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
Similar News
News March 25, 2026
రామ్ చరణ్‌కు గాయం?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి గాయమైనట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదమేమీ లేదని, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు టాక్. చరణ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News March 25, 2026
ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనంది: ట్రంప్

న్యూక్లియర్ వెపన్స్‌ను ఎప్పటికీ తయారు చేయనని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. రీసెంట్‌గా జరిగిన చర్చల్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తోందని, ఇరాన్ ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతోందని అన్నారు. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఈ చర్చల వార్తలను కొట్టిపారేస్తున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఐదు రోజుల గడువు ఇచ్చి డీల్ కుదురుతుందన్న ఆశతో ఉన్నారు.
News March 25, 2026
లాస్ట్ మినిట్ డుమ్మాతో టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది: గంగూలీ

టీమ్ ఇండియా కంటే IPL టీమ్‌ను నిర్మించడమే కష్టమని గంగూలీ అన్నారు. ‘భారత జట్టుకైతే బెస్ట్ ప్లేయర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ IPLలో ప్లేయర్స్ 10 టీమ్స్‌కు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇలాంటి టైమ్‌లో క్వాలిటీ ప్లేయర్స్ లాస్ట్ మినిట్‌లో రాకపోతే టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది’ అని గంగూలీ అన్నారు. మిచెల్ స్టార్క్ రాకపై సస్పెన్స్ నెలకొన్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఈ కామెంట్స్ చేశారు.


