News October 8, 2024

GATE-2025 గడువు పొడిగింపు

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్‌-2025కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించినదాని ప్రకారం అక్టోబర్ 3నే గడువు ముగియాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డెడ్‌లైన్ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత సెప్టెంబర్ 26నే గడువు తేదీగా ప్రకటించారు. gate2025.iitr.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News March 16, 2026

మార్చి 16: చరిత్రలో ఈరోజు

image

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు జననం
*1901: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం
*1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం
*1963: భారత దేశ రెండో ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి మరణం
*జాతీయ టీకా దినోత్సవం

News March 16, 2026

పాక్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. సిరీస్ కైవసం!

image

పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 279 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. సల్మాన్ అఘా(106) సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, నహిద్ రాణా 2, ముస్తాఫిజుర్ రహ్మాన్ 3, హొస్సేన్ 1 వికెట్ తీశారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1తో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.

News March 16, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.