News October 8, 2024

వెహికల్ స్క్రాపింగ్ పాలసీ.. రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం

image

TG: వెహికల్ స్క్రాపింగ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి, అదే కేటగిరీలో కొత్త వాహనం కొంటే రాయితీ కల్పించనుంది. టూ వీలర్స్ ధర ₹లక్షలోపు ఉంటే ₹1000, ₹1-2లక్షలు అయితే ₹2,000, ₹2-3లక్షలకు ₹3,000, 4 వీలర్స్‌కు ధర ₹0-5లక్షలు ఉంటే ₹10,000, ₹5-10Lకు ₹20,000, ₹10-15Lకు ₹30,000, ధర ₹20లక్షలకు పైన ఉంటే ₹50,000 రాయితీ ఇవ్వనుంది.

Similar News

News March 7, 2026

వేసవిలో దోసకాయలు తింటే?

image

దోసకాయల్లో 90 శాతం నీరు, పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్, ఫైబర్, విటమిన్-C, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండే వేసవి కాలంలో వీటిని తినడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. రక్తపోటు, బరువు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీల్లో రాళ్లను నివారించవచ్చు. తక్షణ ఎనర్జీ లభిస్తుంది. హానికర టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి.
#ShareIt

News March 7, 2026

నెలకు ₹2,500.. ఫ్రీ బస్ జర్నీ: మహిళలకు TVK చీఫ్ వరాలు

image

తమిళనాడు ఎన్నికల దృష్ట్యా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు TVK చీఫ్ విజయ్ కీలక హామీలు ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లేడీస్ కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏటా ఫ్రీగా 6 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాఠశాల చిన్నారులకు ఏడాదికి ₹15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామని హామీ ఇచ్చారు.

News March 7, 2026

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదు: ప్రభుత్వ వర్గాలు

image

దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేందుకు ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ ఇంపోర్ట్స్‌ను 60% నుంచి 70%కి పెంచినట్లు తెలిపాయి. అలాగే ముప్పులేని పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడంతో హార్ముజ్ మార్గంలో రవాణా త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.