News October 8, 2024
ఎల్లుండి లావోస్ పర్యటనకు మోదీ

ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్తారు. అక్కడ ఆయన రెండు రోజులపాటు పర్యటిస్తారని విదేశాంగశాఖ తెలిపింది. 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. ఈ సమ్మిట్‌లో వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావోస్‌తోనూ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News November 6, 2025
విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తాం: రామ్మోహన్

AP: ప్రపంచంలో రోజూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని, దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. <<18216721>>సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్<<>> కోసం ఢిల్లీలో పర్యటిస్తోన్న స్టూడెంట్లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ కావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News November 6, 2025
మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్‌లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.
News November 6, 2025
ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.


