News October 8, 2024
₹వందల కోట్లు దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన: జగదీశ్ రెడ్డి

TG: హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘చెరువులపై చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా? గూగుల్ మ్యాప్స్ మొదలైనప్పటి నుంచి చెరువుల పరిస్థితేంటో చూద్దాం. ప్రకటించిన లిస్ట్ ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా? కూల్చివేతలతో ఇప్పటికే ₹1000కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం జరిగింది. ₹వందల కోట్లు దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన’ అని ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.
Similar News
News February 1, 2026
పన్నుల వాటా: APకి ₹64362 కోట్లు, TGకి ₹33180 కోట్లు

FY26-27కి యూనియన్ ట్యాక్స్‌లు, డ్యూటీ నికర ఆదాయాల నుంచి రాష్ట్రాల వారీగా పంపిణీ అయ్యే నిధులను కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ఏపీకి ₹64362 CR, ₹33180 CR అందనున్నాయి. గతేడాదిలో APకి ₹56373 CR, TGకి ₹29280 CR రివైజ్డ్ కేటాయింపుల్లో చూపింది. కాగా యూపీకి ₹268910 CR బిహార్‌కు ₹151831 CR, మధ్యప్రదేశ్‌కు ₹112133CR మహారాష్ట్ర కు ₹98306CR రాజస్థాన్‌కు ₹90445CR కేటాయించింది.
News February 1, 2026
రక్షణ రంగానికి కేటాయింపులు పెంపు

2026 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ.1.04 లక్షల కోట్లు అధికం. ఆయుధాల ఆధునికీకరణకు రూ.2.19 లక్షల కోట్లు(21.84% పెంపు), రోజువారీ నిర్వహణకు 17.24% అదనపు నిధులు ఇచ్చారు. పెన్షన్ల కోసం రూ. 1.71 లక్షల కోట్లు కేటాయించారు. GDPలో రక్షణ వ్యయం 8% నుంచి 11% పెరిగింది. సరిహద్దు సవాళ్ల నేపథ్యంలో సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ భారీ కేటాయింపులు జరిగాయి.
News February 1, 2026
120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

BSNLలో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెలికంలో 95, ఫైనాన్స్‌లో 25 ఉద్యోగాలున్నాయి. జాబును బట్టి BE/BTech(ఎలక్ట్రానిక్స్& టెలికమ్యూనికేషన్స్), CA/CMA పాసైన వారు అర్హులు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://bsnl.co.in/


