News October 8, 2024
‘ఎన్టీఆర్-నీల్’ మూవీ టీమ్ కీలక నిర్ణయం?

సలార్, కల్కి 2898 ఏడీ, దేవర తదితర క్రేజీ సినిమాలన్నీ రెండేసి భాగాలుగా మారాయి. అయితే ‘ఎన్టీఆర్31’ను మాత్రం కచ్చితంగా ఒకే పార్ట్‌గా తీసుకురావాలని ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘దేవర’ రెండు భాగాలుగా వస్తున్న నేపథ్యంలో మరో సినిమాను కూడా అలా విడదీయడం సరికాదని తారక్ సూచించారని, అందుకు నీల్ అంగీకరించారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా 1969 నాటి కథతో ఉంటుందని సమాచారం.
Similar News
News January 13, 2026
IIT హైదరాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు

<
News January 13, 2026
ఇరాన్‌లో రక్తపాతం.. 2,000 మంది మృతి!

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు సుమారు 2,000 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు ‘ఉగ్రవాదులే’ కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంటర్నెట్ నిలిపివేతతో పూర్తి వివరాలు తెలియడం లేదు. అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
News January 13, 2026
సనాతన ధర్మాన్ని తుడిచేయడం అంత ఈజీ కాదు: అమిత్ షా

భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, ప్రజల విశ్వాసాన్ని తుడిచేయడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయన మాట్లాడారు. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు శతాబ్దాలుగా పదే పదే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. దాడులు చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని, ఆలయం మాత్రం సాగర తీరంలో సగర్వంగా నిలబడి ఉందని అన్నారు.


