News October 8, 2024

అనకాపల్లి: 14 నుంచి పల్లె పండగ వారోత్సవాలు

image

ఈనెల 14 నుంచి అనకాపల్లి జిల్లాలో పల్లె పండగ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ వారోత్సవాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించినట్లు పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. పంచాయతీల వారీగా షెడ్యూల్ తయారుచేసి వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు ముందుగా అందజేస్తామన్నారు.

Similar News

News March 22, 2026

విశాఖ: ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్

image

నగరంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం వేకువజాము వరకు కైలాసగిరి, సత్యం కూడలిలో గల విప్రో కంపెనీ వద్ద ఆక్టోపస్ టీం విశాఖ నగర సిటీ పోలీస్ బాంబు స్క్వాడ్‌తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. అకస్మాత్తుగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే దాని నుంచి వీఐపీలను ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వారు తెలిపారు.

News March 22, 2026

విశాఖ: మహిళ ఆత్మహత్యాయత్నం

image

ఆరిలోవలోని గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో బంధువులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. శ్వేత అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా పాతగరువులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఆడపడుచు ఉంటున్న ఎస్సైజీనగర్ ఇంటికి శ్వేత వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్వేత వెంటనే అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకోగా తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు.

News March 22, 2026

నీటిని పొదుపుగా వాడండి: జీవీఎంసీ కమిషనర్

image

వేసవి కాలంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర వాసులకు సూచించారు. ప్రస్తుతం విశాఖనగరానికి రోజుకు సుమారు 400 మిలియన్ లీటర్ల (MLD) నీటి అవసరం ఉండగా.. 2047 నాటికి ఇది సుమారు 726 MLDకి పెరుగుతుందని తెలిపారు. విశాఖపట్నం వేగంగా ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కావున నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నగర పరిపాలనకు సహకరించాలని ఆయన కోరారు.