News October 8, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లా బ్యాటర్

image

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్ ఆడబోనని తెలిపారు. వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2007లో అరంగేట్రం చేసిన ఆయన బంగ్లా తరఫున ఇప్పటివరకు 50 టెస్టులు, 232 వన్డేలు, 139 టీ20లు ఆడారు. మొత్తం 10,695 రన్స్ చేశారు. టెస్ట్ ఫార్మాట్‌కు 2021లో గుడ్ బై చెప్పారు.

Similar News

News October 8, 2024

Official: హ‌రియాణాలో ఎవ‌రికి ఎన్ని సీట్లంటే?

image

హ‌రియాణాలో ఓట్ల లెక్కింపు ముగిసింది. అధికార BJP ఇప్ప‌టికే మ్యాజిక్ ఫిగ‌ర్‌ని దాటి 3వసారి అధికారాన్ని దక్కించుకుంది. కొద్దిసేప‌టి క్రిత‌మే చివ‌రి స్థానంలో కౌంటింగ్ ముగిసింది. EC లెక్క‌ల ప్ర‌కారం 90 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 37, INLD 2, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజ‌యం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును స్థానిక పార్టీలు, ఇండిపెండెంట్లు చీల్చడంతో బీజేపీ సునాయాసంగా విజయం సాధించింది.

News October 8, 2024

4 రాష్ట్రాల్లో బీజేపీ హ్యాట్రిక్

image

హరియాణా ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో వరుసగా మూడు సార్లు ఏ పార్టీ గెలవలేదు. తాజాగా దాన్ని బీజేపీ సుసాధ్యం చేసింది. ఇంతకుముందు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో కమలం హ్యాట్రిక్ నమోదు చేసింది. తాజాగా ఆ లిస్టులో హరియాణా చేరింది.

News October 8, 2024

ప్రధాని మోదీ నాయకత్వం వల్లే ఈ విజయం: పవన్ కళ్యాణ్

image

హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రధాని మోదీ నాయకత్వం, ప్రజా సంక్షేమంపై దృష్టి, ఆయనకున్న ప్రజల మద్దతును మరోసారి చాటి చెప్పిందని అన్నారు. హరియాణా, జమ్మూ&కశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.