News October 8, 2024
తూ.గో.జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు

2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.100 కోట్ల నిధులను కేటాయించిందని టూరిజం అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లకు, రాజమండ్రి నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ దిశగా సంబంధిత అధికారులు పనులు ప్రారంభించారు.
Similar News
News August 21, 2025
తూ.గో జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

గోదావరి వరదల నేపథ్యంలో రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్, కొవ్వూరు, రాజమండ్రి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 8977935611, రాజమండ్రి డివిజన్ 0883-2442344, కొవ్వూరు డివిజన్ 08813-231488, మునిసిపల్ కార్పొరేషన్ 9494060060 కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలన్నారు.
News August 20, 2025
మార్వాడీ గోబ్యాక్ నినాదం చాలా తప్పు: ఛాంబర్ ఆఫ్ కామర్స్

మార్వాడీలు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చని, వారు ఈ దేశంలో భాగమని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కొందరు మార్వాడీ సోదరులకు మనస్థాపంతో కలిగిస్తే క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలను మార్వాడీలు, అపార్థం చేసుకోవద్దని వారికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు.
News August 20, 2025
గోదావరి తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కందుల

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద పెరుగుతున్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. గోదావరి నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం, వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలు పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.