News October 8, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అమడగూరు మండలంలోని సుబ్బయ్య నారవపల్లి గ్రామ సమీపంలో రామలక్ష్మమ్మ (52) అనే వివాహితను ఓ తోటలో దుండగులు హత్య చేశారు. మృతురాలి స్వస్థలం పెనుకొండగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 3, 2026

పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన

image

అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. మొత్తం 575 పంచాయతీలు ఉండగా, గతంలోనే ఎన్నికలు జరగని ఏ.నారాయణపురం, పామిడిలకు పాత అధికారులే కొనసాగుతారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రత్యేక అధికారుల జాబితాకు ఆయన ఆమోదముద్ర వేశారు. మండలాల్లో ఒక్కో అధికారికి రెండు నుంచి ఆరు పంచాయతీల బాధ్యతలను అప్పగించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News April 2, 2026

ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని DPMU కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రకృతి వ్యవసాయ టీవోటీ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. పీడీఎంఎస్‌ను జిల్లాలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో వినూత్న మోడల్స్ జిల్లా ద్వారా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు ఆదర్శం అవ్వడం గర్వకారణం అని అన్నారు.

News April 2, 2026

అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: టీసీ వరుణ్

image

అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించడాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేక నిప్పులు కక్కుతున్నారని అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ మండిపడ్డారు. పబ్జీ గేమ్ స్ఫూర్తితో రాజధానిపై వ్యాఖ్యలు చేస్తూ నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పటిష్ఠ నాయకత్వంలోనే రాజధాని అజేయంగా నిలిచిందన్నారు. దీనికి మద్దతు తెలిపిన పార్టీలకు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలిపారు.