News October 8, 2024

HYD: రాంగ్ సైడ్ డ్రైవింగ్.. 3 లక్షల కేసులు: ఎసీపీ

image

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత, అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎసీపీ జి.శంకర్ రాజు అన్నారు. మలక్‌పేట్‌‌లోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 2024లో ఇప్పటి వరకు 3లక్షల కేసులయ్యాయన్నారు.

Similar News

News March 21, 2026

HYDలో ఈ-సిగరెట్ల దందా.. 261 ప్రాంతాల గుర్తింపు

image

HYDలో ఈ-సిగరెట్ల దందా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈగల్ టీమ్ నివేదిక ప్రకారం.. సుమారు 261 ప్రాంతాల్లో వీటి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కళాశాలల పరిసరాలు, పాన్ దుకాణాలు, సిగరెట్ షాపుల వద్ద ఇవి విస్తృతంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-సిగరెట్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరిస్తూ, నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

News March 21, 2026

HYD: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా!

image

మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న దొడ్ల ప్రతాప్ గ్రూప్ డైరెక్టర్ దివ్యరెడ్డి అకౌంటెంట్‌కు వాట్సాప్‌లో డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. డైరెక్టర్ దివ్యరెడ్డి ఫొటో డీపీ ఉండటంతో అకౌంటెంట్ దాంట్లో సూచించిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేశారు. మరోసారి డబ్బులు పంపించాలని సూచించడంతో మోసం బయట పడింది. వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 21, 2026

నాకు ప్రాణ హాని ఉంది.. అమిత్ షాకు రాజాసింగ్ లేఖ!

image

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు వస్తున్న ప్రాణహాని బెదిరింపులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఫోన్ కాల్స్, లేఖల ద్వారా తనకు, కుటుంబ సభ్యులకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని లేఖలో తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బెదిరింపులపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.