News October 8, 2024
పాక్ రికార్డు బద్దలు కొట్టిన టీమ్ ఇండియా
అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ మంది ఆటగాళ్లను పరిచయం చేసిన జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది. ఇప్పటివరకు భారత్ 117 మంది ఆటగాళ్లను పరిచయం చేసింది. బంగ్లాతో జరిగిన తొలి టీ20లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ (116) రికార్డును అధిగమించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (111), శ్రీలంక (108), సౌతాఫ్రికా (107), ఇంగ్లండ్ (104), న్యూజిలాండ్ (103) ఉన్నాయి.
Similar News
News January 3, 2025
CMR బాత్ రూం వీడియోల కేసు.. కాలేజీకి 3 రోజులు సెలవులు
TG: మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్ రూంలో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురిని అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 12 ఫోన్లలో డేటానూ కాప్స్ చెక్ చేస్తున్నారు. అటు దర్యాప్తునకు ఇబ్బంది లేకుండా 3 రోజుల పాటు CMR కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది.
News January 3, 2025
అధికారులు సీరియస్‌గా అర్జీలు పరిష్కరించాలి: అనగాని
APలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి CCLA ఆఫీసులో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్షించారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై CM కూడా సీరియస్‌గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
News January 3, 2025
వైసీపీకి 11 సీట్లు.. అందుకే: చింతామోహన్
AP: మాజీ సీఎం జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై 11 కేసులున్నాయని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని తెలిపారు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమో అని ఎద్దేవా చేశారు. YCPని ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు. డబ్బుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన కోరారు.