News October 8, 2024

కాంగ్రెస్ అంద‌రినీ రెచ్చ‌గొట్టింది: మోదీ

image

హ‌రియాణాలో కాంగ్రెస్ అన్ని వ‌ర్గాల్ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిందని, అయినా ప్ర‌జ‌లు ఆ పార్టీని తిర‌స్క‌రించార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఆందోళ‌న‌ల పేరుతో రైతుల్ని, యువ‌త‌ను, కులాల పేరుతో పేద‌ల్ని రెచ్చ‌గొట్టి స‌మాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని మండిప‌డ్డారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. విభజన రాజ‌కీయాలు ఇక ఎంత‌మాత్రం సాగవని పేర్కొన్నారు.

Similar News

News February 2, 2026

రాహుల్ కామెంట్లతో LSలో దుమారం

image

రాహుల్ గాంధీ కామెంట్లతో LSలో గందరగోళం తలెత్తింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆరోపిస్తూ మాజీ ఆర్మీ చీఫ్ నరవణె ఇంకా ప్రచురించని బుక్‌లోని అంశమే ఆధారమన్నారు. దీనిపై కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంకా ప్రచురించని పుస్తకంలోని అంశాలపై ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది వందశాతం నిజమని, దేశభక్తి ఎవరికి ఉందో తెలుసని రాహుల్ స్పష్టం చేశారు.

News February 2, 2026

భారత వ్యూహానికి సైంధవుడిలా అడ్డుపడ్డ ట్రంప్!

image

ఇరాన్‌లో భారత్ వ్యూహాత్మకంగా చేపట్టిన <<19028102>>చాబహార్<<>> ప్రాజెక్టు కలలకు US అధ్యక్షుడు ట్రంప్ సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. ఆ పోర్టుపై భారత్ దాదాపు ₹1000కోట్లు ఖర్చు చేసింది. 2025 SEPలో ట్రంప్ ఈ పోర్టుపై ఆంక్షలు విధించడం, తాజాగా ఇరాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతుండటం భారత కలలకు బీటలు వేసినట్లు అయింది. భారత్ వెనక్కి తగ్గడంతో చైనాకు మిడిల్ ఈస్ట్‌పై పట్టుపెంచుకునే అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.

News February 2, 2026

జీరో టిల్లేజి సాగు విధానం – ఏ పంటలకు అనుకూలం?

image

వరి కోత యంత్రంతో పైరును కోశాక దుక్కి చేయకుండా ఇతర పంట విత్తనాలను విత్తే పద్ధతిని జీరో టిల్లేజి సాగు పద్ధతి అంటారు. ఇది మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు, శనగకు అనుకూలం. ఈ పద్ధతిలో విత్తేటప్పుడు చాలినంత తేమ నేలలో లేకపోతే ఒక తడి ఇచ్చి విత్తుకొవడం మంచిది. విత్తనాలను చేతితో విత్తే పరికరాలతో నాటితే సమయం ఆదా అవుతుంది. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేట్లు విత్తుకోవాలి.