News October 8, 2024
ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తా: MP మాగుంట

రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పనలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా జిల్లాను ఏ విధంగా అభివృద్ది చేసుకోవాలన్న విషయంపై ప్రతిఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. అలాగే సి.ఎస్.ఆర్ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News March 10, 2026
మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట రూ.కోటి టోకరా..?

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి నమ్మబలికి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించడానికి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాదిగా నియమకాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 15 నెలలు అవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు వెనకకు ఇవ్వాలని బాధితులు అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది.
News March 10, 2026
ప్రకాశం జిల్లాలో మిస్సింగ్ కేసులపై దృష్టి

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 10, 2026
మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


