News October 8, 2024

ఐపీఎస్‌ పీవీ సునీల్‌ కుమార్‌పై వేటు

image

AP: ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. సాధారణ పరిపాలనశాఖ, అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో ఆర్టీ నంబ‌ర్ 1695 జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కాన్ఫిడెన్షియల్ కింద ఉత్తర్వుల‌ు అప్‌లోడ్ అయినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో CID చీఫ్‌గా పనిచేసిన సునీల్‌పై MLA RRR ఫిర్యాదు చేయడంతో పోలీసులు <<14296857>>కేసు<<>> నమోదు చేశారు.

Similar News

News January 24, 2026

Grok సేవలకు అంతరాయం

image

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్‌లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.

News January 24, 2026

అరుణోదయ స్నానం ఆచరిస్తూ పఠించాల్సిన మంత్రం ఇదే..

image

“యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’
తెలిసీ, తెలియక చేసిన పాపాలు, తప్పుల వల్ల వచ్చిన రోగాలు, శోకాలన్నీ ఈ సప్తమి స్నానంతో నశించుగాక! అని దీనర్ధం.

News January 24, 2026

గుంటూరు జిల్లాలో 45 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖ 45 <>పోస్టుల<<>> భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, DMLT, BSc(BZC), PG డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), D.ఫార్మసీ, B.ఫార్మసీ, M.ఫార్మసీ, PGDCA అర్హత గలవారు ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: guntur.ap.gov.in