News October 8, 2024
తణుకు: స్నానానికి కాలువలో దిగి గల్లంతైన భవాని భక్తుడు

తణుకు మండలం తేతలికి చెందిన భవాని భక్తుడు మంగళవారం రాత్రి స్నానానికి కాలువలో దిగి గల్లంతయ్యాడు. కాజా దుర్గాప్రసాద్ (23) స్థానికంగా ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల భవాని మాల ధరించిన ఆయన అత్తిలి కాల్వలో స్నానానికి దిగి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Similar News
News September 19, 2025
ఏలూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ఏలూరు రూరల్ పరిధిలోని ఓ దాబాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరు యువతులను అరెస్టు చేశామని SI నాగబాబు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వహకుడిపై కేసు నమోదు చేశామన్నారు.
News September 19, 2025
కార్యాలయాల్లో ఇ – ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి: కలెక్టర్

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ – ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి అని, జిల్లా ప్రగతికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పలు అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలన్నారు. కాగితం దస్త్రాలను క్రమేపి తగ్గించాలన్నారు.
News September 19, 2025
5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.