News October 8, 2024
హరియాణా ఎన్నికల ఫలితాలపై ‘కేకే సర్వే’ ఫ్లాప్

హరియాణాలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని అంచనా వేసిన కేకే సర్వే పూర్తిగా విఫలమైంది. హరియాణాలో 90 ఎమ్మెల్యే సీట్లకు గాను కాంగ్రెస్ 75, బీజేపీ 11 సీట్లు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొంది. కానీ వాస్తవ ఫలితాలను చూస్తే బీజేపీ 48, కాంగ్రెస్ 37 చోట్ల గెలిచాయి. కాగా, ఏపీ ఎన్నికల్లో కూటమికి 160 సీట్లు వస్తాయని అంచనా వేసిన కేకే సర్వే అక్షరాలా నిజమైంది.
Similar News
News January 27, 2026
ఈ లక్షణాలుంటే C విటమిన్ లోపించినట్లే..

C విటమిన్ మన రోగనిరోధక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన పోషకం. దీని లోపం వల్ల అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. కారణం లేకుండా నిరంతరం అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపించడం, జలుబు, దగ్గు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపు, దంతాలు కదలడం, చర్మం పొడిగా మారడం, గాయాలు త్వరగా నయం కాకపోవడం, కీళ్ల నొప్పులు, పొడి జుట్టు, చిట్లిన వెంట్రుకలు ఉంటే C విటమిన్ లోపం ఉన్నట్లు గుర్తించాలంటున్నారు.
News January 27, 2026
ఇంటర్వ్యూతో ICMRలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<
News January 27, 2026
ధాన్యం నిల్వలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకలను కట్టడి చేయకుంటే అవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.


