News October 9, 2024

అనకాపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి

image

అనకాపల్లి జిల్లాలో సాగినీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థలో రైతులను భాగస్వామ్యం చేసి సాగునీటి సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్ఎం

image

విశాఖ రైల్వే స్టేషన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండుగల రద్దీ కారణంగా రైల్వే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి స్టేషన్‌లో మంచినీటి పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్లాట్ ఫామ్‌పై ఉన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో శుభ్రత ప్రమాణాలు పాటించాలన్నారు.

News September 20, 2025

విశాఖ కలెక్టరేట్లో ఉచిత వైద్య శిబిరం

image

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 147 మంది సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News September 20, 2025

విశాఖ: 3రోజుల్లో 1,759 ఆక్రమణల తొలగింపు

image

విశాఖ ఆపరేషన్ లంగ్స్ 2.0 కింద 3 రోజుల్లో 1,759 ఆక్రమణలు తొలగించినట్లు సిటీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకరరావు ప్రకటించారు. తగరపువలస, భీమిలి-51, శ్రీకాంత్‌నగర్, అంబేద్కర్ జంక్షన్-70, గురుద్వారా, పోర్ట్ స్టేడియం-60, అంబేద్కర్ సర్కిల్, జైలు రోడ్డు-195, ఊర్వశి జంక్షన్-35, గాజువాక, వడ్లపూడి-204, నెహ్రూచౌక్-26, వేపగుంట, గోశాల జంక్షన్, సింహాచలం ద్వారం పరిధిలో 65 ఆక్రమణలు తొలగించారు.