News October 9, 2024

నిలవాలంటే గెలవాల్సిందే..

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. విజయం సాధిస్తే సెమీస్ ఆశలు పదిలం కానున్నాయి. నిన్న ఆస్ట్రేలియాపై భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి భారత్‌కు కాస్త ప్లస్‌గా మారింది. కాగా మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది.

Similar News

News October 9, 2024

హిందూ మెజార్టీ స్థానాల్లో బీజేపీ అనూహ్య ఓటమి

image

జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూలో తమకు పట్టున్న రెండు స్థానాల్లో BJP ఓటమి పాలైంది. హిందూ ఓటర్లు అధికంగా ఉన్న బానీ, రాంబన్ నియోజకవర్గాల్లో ఓటమి చవి చూసింది. బానీ స్థానంలో BJP అభ్యర్థి జెవాన్‌లాల్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి రామేశ్వర్ సింగ్ ఏకంగా 18,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాంబన్‌లో NC అభ్యర్థి అర్జున్ సింగ్ 8,869 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో ఈ రెండు స్థానాల్లో BJP నెగ్గింది.

News October 9, 2024

ఏపీకి బుల్లెట్ ట్రైన్.. ఎంపీలతో చంద్రబాబు

image

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఏపీని కూడా రైల్వే శాఖ భాగం చేసిందని కూటమి ఎంపీలకు CM చంద్రబాబు తెలిపారు. తొలి దశలో దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు మీదుగా మైసూరు, ముంబై నుంచి HYD వరకు ట్రైన్‌లను ప్రతిపాదించారు. తాజాగా బెంగళూరు, చెన్నై, HYD, అమరావతి నగరాలను కలిపేలా ప్రతిపాదనలు తయారవుతున్నాయని బాబు వెల్లడించారు. నివేదిక సిద్ధం అయ్యాక రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందన్నారు.

News October 9, 2024

బ్యాటరీ పర్సంటేజ్‌తో ఈసీకి కాంగ్రెస్ అభ్యర్థుల ఫిర్యాదు

image

హరియాణాలోని మహేంద్రగఢ్, పానిపట్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఈవీఎం బ్యాటరీల పర్సంటేజ్‌తో ఈసీకి ఫిర్యాదు చేశారు. EVMలలో 99% బ్యాటరీ ఉన్నచోట BJP, 60-70% ఉన్నచోట కాంగ్రెస్ లీడ్‌లో ఉందని, కుట్ర జరిగిందని ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ‘EVMలలో ఆల్కలీన్ బ్యాటరీలు వాడుతున్నాం. ఇది వోల్టేజీని బట్టి పర్సంటేజ్ తక్కువగా చూపిస్తుంది. ఫలితాలకు బ్యాటరీకి సంబంధం లేదు’ అని పేర్కొంది.