News October 9, 2024

ఆ విద్యార్థులకు పాత సిలబస్‌తో పబ్లిక్ ఎగ్జామ్స్

image

AP: పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో చదివి ఫెయిల్ అయిన ప్రైవేట్, రీ ఎన్‌రోల్ విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు SSC పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారికి కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయన్నారు. క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు.

Similar News

News October 9, 2024

‘యానిమల్’ రోల్‌పై ట్రోలింగ్‌తో ఏడ్చేశా: త్రిప్తి

image

‘యానిమల్’లో తాను పోషించిన రోల్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు రావడంతో నటి త్రిప్తి దిమ్రీ 2-3 రోజులు ఏడుస్తూ కూర్చున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సందీప్‌రెడ్డి డైరెక్షన్‌లో రణ్‌బీర్ హీరోగా వచ్చిన ఆ మూవీలో త్రిప్తి బోల్డ్ క్యారెక్టర్‌ చేశారు. దానిపై వచ్చిన ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని ఆమె అన్నారు. అయితే కొన్నిసార్లు ఏడవటమూ గాయం నుంచి బయటపడేస్తుందని చెప్పుకొచ్చారు.

News October 9, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పడిపోయి రూ.1,00,000కి చేరింది.

News October 9, 2024

WTC: రికార్డు సృష్టించిన రూట్

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) చరిత్రలో 5వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ (5005) రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించారు. 59 మ్యాచుల్లో అతను ఈ ఫీట్‌ను అందుకోగా, అతని తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు లబుషేన్(3904), స్మిత్(3,484) ఉన్నారు.