News October 9, 2024

దసరా స్పెషల్.. HYD – KMM మధ్య బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా TGSRTC ఈరోజు నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం మధ్య స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు వెళ్లే మహాలక్ష్మి ప్రయాణికుల కోసం LB నగర్ నుంచి ఎక్కువ బస్సులు ఉంటాయన్నారు.

Similar News

News January 14, 2026

UPDATE: ఖమ్మం LIG ఫ్లాట్ల రహదారి సమస్య పరిష్కారం

image

ఖమ్మం శ్రీరాం నగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIG ఫ్లాట్లలో రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైనట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రమణా రెడ్డి వెల్లడించారు. కాగా రహదారి విషయంలో ఏర్పడిన సమస్య కారణంగా, అనేక మంది దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం కావడంతో LIG ఫ్లాట్స్‌కు JAN 18 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, 19న లాటరీ ద్వారా ప్లాట్స్ కేటాయిస్తామని పేర్కొన్నారు.

News January 14, 2026

మధిర, వైరా నియోజకవర్గాలకు రూ.140 కోట్లు మంజూరు

image

మధిర మున్సిపాలిటీ పరిధిలో డ్రైయిన్స్, వైరా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేసిందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. రూ.40 కోట్లతో మధిర మున్సిపాలిటీలో డ్రైయిన్ నిర్మాణం, రూ.65 కోట్లతో వైరా నది వెంట వరద నివారణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మురుగునీటి కాలువల ఆధునీకరణ పనులకు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

News January 14, 2026

ఖమ్మం జిల్లాలో 1,43,320 మంది ఓటర్లు

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,43,320 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా ఏదులాపురంలో 45,256 మంది ఓటర్లు ఉండగా.. తక్కువగా కల్లూరులో 18,866 మంది ఉన్నారు. సత్తుపల్లి 28,830, మధిర 25,679, వైరా 24,689 ఓటర్లతో మున్సిపల్ బరి సిద్ధమైంది. ఓటర్ల జాబితా ఖరారు కావడంతో రాజకీయ సందడి మొదలైంది.