News October 9, 2024

బతుకమ్మ పూల కోసం చెరువులో దిగి వ్యక్తి మృతి

image

అశ్వాపురం మండలం జగ్గారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నున్న ఐలయ్య బతుకమ్మ పండుగ పూల కోసంకోసం గ్రామ పరిధిలో ఉన్న ఊర చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నున్న ఐలయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐలయ్య మణుగూరు సురక్ష బస్టాండ్‌లో హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.

Similar News

News March 1, 2026

ఖమ్మం: కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్‌ఓ

image

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు.

News March 1, 2026

భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుంది: తుమ్మల

image

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. పేదలకు చేసిన మోసం బయటకు రాకుండా కొందరు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని, అప్పుడు తప్పుడు ప్రచారం చేసే జర్నలిస్టులు పశ్చాత్తాపపడతారన్నారు.

News March 1, 2026

రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఖమ్మం జిల్లా

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్‌ ఐడీ’ (రైతు గుర్తింపు కార్డు) నమోదులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 75.59 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య వెల్లడించారు. జిల్లాలోని 3.39 లక్షల మంది రైతులకు గాను, ఇప్పటికే 2.33 లక్షల మంది 11 అంకెల ఐడీలను పొందారు. మిగిలిన రైతులు మార్చి 15లోగా ఏఈఓలను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు.