News October 9, 2024

విశాఖలో పెరిగిన విమాన ప్రయాణికులు

image

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జులైలో 1,720 విమానాల ద్వారా 2,25,261 మంది.. ఆగస్టులో 1,872 విమానాల్లో 2,52,311 మంది ప్రయాణించినట్లు ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ తెలిపింది. సెప్టెంబరులో 1,806 సర్వీసుల్లో 2,25,215మంది ప్రయాణించినట్లు వివరించింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే 6.8శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.

Similar News

News October 9, 2024

విశాఖ: ఒక్కరే 30మద్యం దుకాణాలకు దరఖాస్తు

image

విశాఖ జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తూ.. ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ మద్యం వ్యాపారి ఏకంగా 30దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కొందరు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తులు ఎక్కువగా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

News October 9, 2024

నేడు మన నితీశ్ కుమార్ రెడ్డి సిక్సర్లతో చెలరేగుతారా..!

image

ఇండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొన్న జరిగిన తన అరంగేట్ర టీ20లో మన విశాఖ ప్లేయర్ నితీశ్ రెడ్డి బౌలింగ్, బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేయడంతో పాటు, బ్యాటింగ్ సమయంలో ఓ భారీ సిక్సర్‌తో 16 రన్స్ చేశాడు. నేడు బంగ్లాతో రెండో టీ20లో సిక్సర్లతో చెలరేగడంతో పాటు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News October 9, 2024

స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు కేంద్రం హామీ: ఎంపీ శ్రీభరత్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందన్నారు.