News October 9, 2024

ఇవాళ ఈ శ్లోకాన్ని పఠించండి!

image

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. చదువులతల్లి జన్మనక్షత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయంటారు. ఇవాళ ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణినీ, నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ’ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించండి.

Similar News

News February 3, 2026

పాక్ బాయ్ కాట్.. రూ.2,200కోట్ల నష్టం

image

T20 WCతో భారత్ మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారీగా నష్టం కలిగే ఛాన్సుంది. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్‌షిప్, టికెట్ల విక్రయాలు తదితరాలు కలుపుకొని రూ.2,200CR వరకు లాస్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు IND-పాక్ బోర్డులకు కలిపి రూ.200CR వరకు నష్టం వాటిల్లొచ్చని చెబుతున్నాయి. ఇది BCCIకి చిన్న విషయమే అయినా పాక్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపనుంది.

News February 3, 2026

ట్రంప్ టారిఫ్స్.. మనకన్నా పాక్, బంగ్లాపైనే ఎక్కువ!

image

ఇండియాపై విధించిన 50% టారిఫ్స్‌ను 18%కు తగ్గిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అమెరికాతో అంటగాగే పాక్, బంగ్లా కంటే తక్కువ కావడం గమనార్హం. బ్రెజిల్‌పై 50%, మయన్మార్-40, లావోస్-40, చైనా-37, సౌతాఫ్రికా-30, వియత్నాం-20, బంగ్లాదేశ్-20, శ్రీలంక-20, పాక్-19, మలేషియా-19, కాంబోడియా-19, థాయ్‌లాండ్‌పై 19% సుంకాలను ట్రంప్ విధించారు. అతితక్కువగా UKపై 10% వసూలు చేస్తున్నారు.

News February 3, 2026

పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>AP: <<>>పల్నాడు DHMOలో 18 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, డిప్లొమా/MD/PSM, డిగ్రీ, PG, MBA/PGD, BCom, BSc(సైన్స్), DMLT, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, BCలకు రూ.300. వెబ్‌సైట్: https://palnadu.ap.gov.in