News October 9, 2024

సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. క్రిస్మస్‌కి బదులు సంక్రాంతికి రిలీజ్ చేస్తే సెలవులు కలిసొస్తాయని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలిపాయి. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ జనవరి 14న విడుదలవనుండగా, మెగాస్టార్ ‘విశ్వంభర’ ఉగాదికి వచ్చే అవకాశం ఉంది.

Similar News

News January 17, 2026

323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<>(SAI<<>>) 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 1-FEB15 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, ఒలింపిక్స్/పారాలింపిక్స్/ఏషియన్ గేమ్స్/ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనడంతోపాటు కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు అర్హులు. రాత పరీక్ష, కోచింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sportsauthorityofindia.nic.in

News January 17, 2026

మట్టి బొమ్మలను దర్శించుకోవడంలో అంతరార్థం ఇదే

image

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముక్కనుమ నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందులో రంగురంగుల మట్టి బొమ్మలను కొలువు తీర్చి పూజిస్తారు. మట్టి నుంచి పుట్టిన ప్రాణి, చివరికి మట్టిలోనే కలుస్తుందనే జీవిత పరమార్థాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ప్రకృతిని(మట్టిని) గౌరీ మాతగా భావించి ఆరాధించడం వల్ల, ఆ తల్లి కరుణతో ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News January 17, 2026

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి

image

స్కిన్‌ ఆరోగ్యంగా, బిగుతుగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడకుండా మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ విటమిన్‌, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలను రోజూ తీసుకోవాలి. రాజ్మా, అవిసెగింజలు, బాదం, కాజులనూ తీసుకోవాలి. విటమిన్‌-సి ఉండే జామ, ఉసిరి తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి. కొబ్బరి, సోయాబీన్‌, మొలకలు కూడా తీసుకోవాలి.