News October 9, 2024

భర్త మృతి.. మరణమైనా నీతోనే అంటూ భార్య ఆత్మహత్య

image

AP: కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ ప్రేమ జంట ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. విధి ఇద్దరినీ బలి తీసుకుంది. విజయవాడకు చెందిన నాగరాజు(29), ఉష(22) ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 18నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సోమవారం రోడ్డు ప్రమాదంలో నాగరాజు చనిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని రక్తపు మడుగులో చూసి ఉష గుండె తల్లడిల్లింది. ప్రాణసఖుడు లేని లోకంలో తాను ఉండలేనంటూ ఉరి వేసుకుంది.

Similar News

News March 7, 2025

నీట్-UG దరఖాస్తుకు నేడే లాస్ట్

image

2025-26 విద్యాసంవత్సరానికి గాను MBBS, BDS, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-UG దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఉంటుంది. మే 4న దేశవ్యాప్తంగా మ.2 గంటల నుంచి సా.5 వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://examinationservices.nic.in/

News March 7, 2025

నేడు మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

News March 7, 2025

గాజా నుంచి పారిపోండి: హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం

image

బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్‌పై ట్రంప్ ధ్వజమెత్తారు. ‘మరణించినవారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి. బందీలను విడుదల చేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మిమ్మల్ని చంపడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైనవన్నీ ఇస్తా. ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడు. తెలివైన నిర్ణయం తీసుకోండి’ అని ఫైర్ అయ్యారు.

error: Content is protected !!