News October 9, 2024

హరియాణాలో కాంగ్రెస్‌కు పెరిగిన ఆదరణ

image

హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్‌లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్‌కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్‌తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.

Similar News

News January 21, 2026

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇంజినీర్స్<<>> ఇండియా లిమిటెడ్‌ 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(సోషల్ వర్క్, సోషియాలజీ, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్), MBA, BE/BTech, BSc, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.eil.co.in

News January 21, 2026

‘2000s’ గ్యాంగ్.. క్రికెటర్ల సెల్ఫీ వైరల్

image

2000దశకంలో క్రికెట్ చూడటం మొదలుపెట్టిన వారికి పైఫొటోలో ఎవరో ఒకరు ఫేవరెట్ ప్లేయరై ఉంటారు. ఓపెనర్‌గా సెహ్వాగ్ బాదుడు, సిక్సర్ల వీరుడు యువరాజ్, ఫీల్డింగ్‌లో కైఫ్ దూకుడు, బౌలింగ్‌లో అగార్కర్, నెహ్రా సత్తా.. ఇలా అప్పట్లో వీరి ఆటకు క్రేజే వేరు. తాజాగా వీరంతా ఒకే దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగారు. లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడీ, స్పోర్ట్స్ ప్రజెంటర్ గౌరవ్ కపూర్‌ కూడా వీరితో ఉన్నారు.

News January 21, 2026

‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CBN

image

AP: అగ్రిటెక్ విధానం అమలుతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని CBN తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతాను. విశాఖకు గూగుల్ సంస్థ రాక గొప్ప ముందడుగు. దీని కోసం లోకేశ్ ఎంతో కష్టపడ్డారు. గ్రీన్ ఎనర్జీ, అమ్మోనియా గురించి లోకం చర్చిస్తున్న సమయంలో AP ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతున్నాం’ అని దావోస్‌లో మీడియాతో పేర్కొన్నారు.