News October 9, 2024
డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు: పూనమ్

ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడని నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ‘MAA’ జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికిందన్నారు. అతడు లీడర్గా మారిన నటుడు కాదని ఆమె హింట్ ఇచ్చారు. అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు/రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారని వాపోయారు. ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు. పూనమ్ ఇటీవల త్రివిక్రమ్పై <<14124651>>ఆరోపణలు<<>> చేశారు.
Similar News
News January 17, 2026
వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టిన మరాఠా

అధికారం కోసం చేసే రాజకీయ విన్యాసాలను ప్రజలు తిరస్కరిస్తారనేందుకు MH మున్సిపల్ ఎన్నికలే తార్కాణం. 2023లో NCP చీలి బాబాయ్, అబ్బాయి శరద్, అజిత్ పవార్లు విడిపోయారు. తాజా ఎన్నికల్లో చేతులు కలిపారు. అటు అన్నదమ్ములు ఉద్ధవ్(శివసేన), రాజ్ ఠాక్రే(MNS)లు కూడా విభేదాలు పక్కనపెట్టి MNP ఎన్నికల్లో కలిసిపోయారు. కానీ వీరికి ఆశించిన ఫలితాలు రాలేదు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిద్దామనుకున్న వీరిని ప్రజలు ఆదరించలేదు.
News January 17, 2026
ఇరాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. భారత్కు కష్టమేనా?

ఇరాన్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఇండియాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని యువరాజు రెజా పహ్లావి ప్రకటించారు. కానీ ఆయన తండ్రి షా మహ్మద్ గతంలో పాక్కు అనుకూలంగా ఉన్నారు. 1965, 1975 ఇండో-పాక్ యుద్ధాల్లో PAKకు మద్దతు తెలిపారు. ఇప్పుడు పహ్లావికి US సపోర్ట్ ఉంది. పాక్, US బంధం నేపథ్యంలో ఇరాన్ వాటికి తోడైతే మనకు కష్టమే. <<18876732>>చాబహార్ పోర్టు<<>> భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదముంది.
News January 17, 2026
కోమా నుంచి కోలుకున్నా.. మార్టిన్ ఎమోషనల్ పోస్ట్

కోమా నుంచి కోలుకున్న AUS మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ Xలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘DEC 27న నా జీవితం తలకిందులైంది. ఒక్క క్షణంలో లైఫ్ ఎలా మారిపోతుందో తెలిసింది. 8 రోజులు <<18765261>>కోమాలో<<>> ఉన్నా. బతికేందుకు 50-50 ఛాన్స్ ఉండగా కోమా నుంచి బయటపడ్డా. కానీ నడవలేకపోయా. ఇప్పుడు కోలుకున్నా. బీచ్లో నిల్చోగలిగా. సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.


