News October 9, 2024

ఎస్సీ వర్గీకరణ అమలు కోసం పూజలు: డొక్కా

image

AP: వైసీపీ తప్ప రాజకీయ పార్టీలన్నీ ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్నాయని TDP నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం కుల గణన చేసినా వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును కూటమి ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈ నెల 11న దుర్గామాత ఆలయాల్లో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో గవర్నర్, మంత్రులు, అఖిలపక్ష నేతలను కలుస్తామని అన్నారు.

Similar News

News January 6, 2026

అమెరికాలో పుట్టి.. HYDకు ఆడుతున్నాడు

image

VHTలో డబుల్ సెంచరీ బాదిన <<18778738>>అమన్ <<>>రావు అమెరికాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కరీంనగర్‌కు చెందినవారు కాగా ఉద్యోగ నిమిత్తం USకు వెళ్లారు. HYDలో పెరిగిన అమన్ క్రికెట్‌పై మక్కువ పెంచుకొని దేశవాళీలో సత్తా చాటుతున్నారు. VHTలో హైదరాబాద్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తొలి, ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. IPL-2026 మినీ వేలంలో అమన్‌ను RR ₹30Lakhsకు కొనుగోలు చేసింది.

News January 6, 2026

డబ్బులివ్వకుంటే సిబ్బందికి జీతాలెలా: KRMB

image

AP, TG ప్రభుత్వాల తీరుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 3 త్రైమాసికాలుగా బోర్డుకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహించింది. FY25-26లో ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై 2 రాష్ట్రాల ఇరిగేషన్ ENCలకు లేఖ రాసింది. సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. కాగా టెలిమెట్రీ ఫేజ్2 కోసం TG అందించిన రూ.4.15CRను మళ్లించి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు.

News January 6, 2026

డాక్టర్‌కూ తప్పని కుల వివక్ష!

image

TG: కులం రక్కసికి ఓ జూనియర్ డాక్టర్ బలైపోయింది. గద్వాల జిల్లాకు చెందిన లావణ్య చిన్నప్పటి నుంచి టాపర్. సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన ప్రణయ్ తేజ్ అనే యువకుడిని ప్రేమించగా అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల కులాలు వేరని పెళ్లికి నో చెప్పడంతో ఆమె పాయిజన్ ఇంజెక్షన్ వేసుకొని సూసైడ్ చేసుకుంది. ప్రణయ్‌ను పోలీసులు అరెస్టు చేసి అట్రాసిటీ కేసు పెట్టారు.