News October 9, 2024

దుర్గమ్మ చెంత కూతురు ఆద్యతో DyCM పవన్ (PHOTOS)

image

విజయవాడలోని కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్య కొణిదెలతో ఆలయానికి చేరుకొని సరస్వతి దేవిగా దర్శనమిస్తోన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి ఇద్దరికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. హోమ్ మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

Similar News

News March 9, 2025

RRRకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ: కిషన్ రెడ్డి

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR)కు త్వరలో PM మోదీ భూమి పూజ చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు నిధులు లేవన్నా తానే నితిన్ గడ్కరీని ఒప్పించినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందుతుందని తెలిపారు. RRRకు తమ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం రూ.100కోట్లే ఇచ్చి కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు.

News March 9, 2025

గ్రూప్-1 ఫలితాలు.. UPDATE

image

రేపు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ముందుగా మార్కులను ప్రకటించనుండగా తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు.

News March 9, 2025

ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రూ.11 వేల కోట్లు

image

TG: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11 వేల కోట్లను మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను విద్యాశాఖ అనుబంధ సంస్థ టీజీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించింది. రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో ఒక్కో క్యాంపస్ చొప్పున రూ.200 కోట్లతో నిర్మించనున్నారు. ముందుగా కొడంగల్, మధిర, హుజుర్ నగర్‌లో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నారు.

error: Content is protected !!