News October 9, 2024

ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR

image

AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్‌లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.

Similar News

News July 8, 2025

రాత్రి 10 గంటలకు.. ఏం జరగబోతోంది?

image

US, భారత్ ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ తొలుత విధించిన 26% టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపేసిన విషయం తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గంటలకు మినీ ట్రేడ్ డీల్ ప్రకటన వెలువడే అవకాశముంది. ఇది స్పెషల్ అని ఇటీవల ట్రంప్ వెల్లడించారు. అదేంటన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 14దేశాలకు టారిఫ్‌లపై లేఖలు పంపిన ట్రంప్ AUG 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

News July 8, 2025

ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోం: మంత్రి సురేఖ

image

TG: భద్రాచలం ఈవో రమాదేవిపై <<16992146>>దాడిని<<>> దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. దాడి జరిగిన ప్రాంతం ఏపీ పరిధిలోనిది కావడంతో సీఎం చంద్రబాబు కలగజేసుకొని, సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆమె కోరారు. తెలంగాణలో ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని సురేఖ హెచ్చరించారు.

News July 8, 2025

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ అరెస్ట్

image

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి బాబు షాహిర్, నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఆర్థిక మోసం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఆ మూవీ కోసం తన నుంచి సౌబిన్, ఆంటోనీలు రూ.7 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియతుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.