News October 9, 2024
హైదరాబాద్‌లో ఉద్రిక్తత.. MRPS ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
TG: HYDలోని పార్శీగుట్ట ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణతో పాటు నేతలు నిరసనకు దిగారు. పార్శీగుట్ట నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా బయలుదేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Similar News
News January 3, 2025
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామిని 62,085మంది దర్శించుకోగా 15,681 మంది తలనీలాల సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.17కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. జనవరి 10-19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
News January 3, 2025
వారికి నియామక పత్రాలు ఎప్పుడిస్తారు?: RSP
TG: జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీచర్లు, స్టాఫ్ నర్సులు, కాలేజీ లెక్చరర్లు, గ్రూప్-4 అభ్యర్థులకు ఇచ్చి వీరికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆలస్యం వెనుక ఉన్న కారణమేంటని, ప్రజా ప్రభుత్వమంటే ఇదేనా అని నిలదీశారు. ఇలానే ఉంటే రాష్ట్ర ప్రజలు అధికారం నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు.
News January 3, 2025
Stock Markets: ఒక్కరోజు మురిపెం!
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ 24,090 (-104), సెన్సెక్స్ 79,517 (-422) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. PSU BANK, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ పెరిగింది. ONGC, TRENT, SHRIRAMFIN, TITAN, NTPC టాప్ గెయినర్స్. నిఫ్టీ ADV/DEC 20:30.