News October 9, 2024

రాష్ట్రంలో పండుగ వాతావరణం లేదు: KTR

image

TG: రాష్ట్రంలో పండుగ వాతావరణం కనపడటం లేదని KTR అన్నారు. ‘ఆడబిడ్డలకు చీరలు లేవు. రైతులకు రైతుబంధు లేదు. ఆఖరికి బతుకమ్మ ఆడేందుకు డీజేలు కూడా లేవు. ఏ అధికారి తమ ఇంటికి వచ్చినా ఇల్లు కూల్చేస్తారని ప్రజలు భయపడుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకే మూసీ ప్రక్షాళన అంటున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ఏమైంది? వీటిపై అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

Similar News

News July 8, 2025

ఈనెల 16న ఆమెకు మరణశిక్ష అమలు!

image

యెమెన్‌లో వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు ఈనెల 16న అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేయనుంది. 2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఈ కేసులో అరెస్టైన ఆమెకు మరణశిక్ష పడింది.

News July 8, 2025

ఆమెతో ఇప్పటికే పెళ్లయిపోయింది: ఆమిర్ ఖాన్

image

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, ఆమెతో ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా బంధం పట్ల గౌరీ, నేనూ సీరియస్‌గా ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములమయ్యాం. ఇక పెళ్లి గురించి అంటారా.. నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నా. అధికారికంగా ఎప్పుడు ప్రకటించాలో త్వరలో నిర్ణయించుకుంటాం’ అని తెలిపారు.

News July 8, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.