News October 9, 2024

హరియాణాలో ఓవర్ కాన్ఫిడెన్స్‌ వల్లే ఓడిపోయాం: కాంగ్రెస్ మాజీ ఎంపీ

image

ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే హరియాణాలో ఓడిపోయామని కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేశ్ అంగీకరించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ అంతర్గత యంత్రాంగం అలసత్వమే కొంప ముంచిందన్నారు. తమ అతిపెద్ద బలహీనత ఇదేనన్నారు. హైకమాండ్ త్వరలోనే దీనిపై సమీక్షిస్తుందని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు NC, కాంగ్రెస్ కూటమికి చక్కని తీర్పునిచ్చారని పేర్కొన్నారు. తమ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Similar News

News July 8, 2025

15ఏళ్లు ముందుగానే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి!

image

అందరిలా 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలని అనుకునేవారికి ప్రముఖ సీఏ కానన్ బహ్ల్ లింక్డ్ఇన్‌లో పలు సూచనలు చేశారు. పెరుగుతున్న ఖర్చులు, జీవనశైలి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం 45 ఏళ్లకే రిటైర్ అవుతారని, అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ‘ఫ్యూచర్ గురించి ఆలోచించి పొదుపును పెంచాలి. EPF & NPSలలో ఇన్వెస్ట్ చేయండి. ఇవి మీ డబ్బును ఎక్కువ కాలం బ్లాక్ చేసి దుర్వినియోగం చేయకుండా చూస్తాయి’ అని తెలిపారు.

News July 8, 2025

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో మరో 20వేల ఎకరాల భూసమీకరణ, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

News July 8, 2025

ఈనెల 16న ఆమెకు మరణశిక్ష అమలు!

image

యెమెన్‌లో వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు ఈనెల 16న అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేయనుంది. 2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఈ కేసులో అరెస్టైన ఆమెకు మరణశిక్ష పడింది.